Palakollu: పాలకొల్లు టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థినిగా గండేటి ఉషారాణి!
Palakollu: పాలకొల్లు మున్సిపల్ టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థినిగా గండేటి ఉషారాణిని మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు.
Palakollu: పాలకొల్లు టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థినిగా గండేటి ఉషారాణి!
Palakollu: టిడిపి పాలకొల్లు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్దినిగా గండేటి ఉషారాణి ఎంపికయ్యారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు తన కార్యాలయంలో ఉదయం నుంచి టిడిపి నేతలతో చర్చించిన అనంతరం శుక్రవారం రాత్రి ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఆమె ప్రస్తుతం పాలకొల్లు మండలం ఆగర్రు జెడ్పీ హైస్కూల్లో ఫిజిక్స్ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఆమె అప్పటికే ఉపాధ్యాయునిగా రాజీనామా చేశారు. ఆమె భర్త గండేటి వెంకటేశ్వరరావు మంత్రి నిమ్మలకు కుడి భుజంగాఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.
గండేటి వెంకటేశ్వర రావు (జీవి) గత కౌన్సిల్లో కౌన్సిలర్‌గా పని చేశారు. చైర్మన్ పదవి కోసం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కర్నేన రోజారమణి కూడా ఈ సీటు ఆశించినా ఆమెకు దక్కలేదని నిరాశతో ఉన్నారు.