Tanuku: ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం, యువకుడిపై ఫోక్సో కేసు!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, బంగారం కాజేసిన పైడిపర్రు యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
Tanuku: ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం, యువకుడిపై ఫోక్సో కేసు!
Tanuku: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తణుకు మండలానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పైడిపర్రు గ్రామానికి చెందిన యువకుడు పంజా వెంకట దుర్గారావుపై పట్టణ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం చివరకు పోలీసు కేసుకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు..తణుకు పట్టణానికి చెందిన బాలికతో పైడిపర్రు గ్రామానికి చెందిన పంజా వెంకట దుర్గారావు ఓ ఫేర్వెల్ పార్టీలో పరిచయమై ఫోన్ నెంబర్ తీసుకుని మెసేజ్‌లు పంపుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
ఈ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను నమ్మించి గత జూలైలో తణుకు మైత్రి హోటల్లో గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా బాలికను నమ్మించి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు తీసుకున్నాడు.
దీంతో ఇంట్లో ఉన్న బంగారం, నగదు ఏమైందని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వారు గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం పట్టణ పరిధి కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణఎస్సైకె.సత్యనారాయణ దుర్గారావుఫై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో శుక్రవారం తణుకులోని మైత్రి హోటల్‌కు భీమవరం, ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్‌లు చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించి మైత్రి హోటల్లో సంబంధిత గదిని పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, క్రైమ్ టీం సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.