Warangal: అరుదైన బాండెడ్ క్రైట్ పాము ప్రత్యక్షం పట్టుకుని అడవిలో విడుదల

Warangal: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఆంకోనిగూడెం (అశోక్ నగర్)లో 5 అడుగుల అరుదైన బాండెడ్ క్రైట్ (కట్టువిరియన్) పాము కలకలం సృష్టించింది.

Update: 2026-08-12 05:36 GMT

Warangal: అరుదైన బాండెడ్ క్రైట్ పాము ప్రత్యక్షం పట్టుకుని అడవిలో విడుదల

Warangal: అశోక్ నగర్ లో అరుదైన పాము, బాండెడ్ క్రైట్‌గా గుర్తించిన అటవీ అధికారులు, స్థానికులు వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.

అటవీ అధికారులు అక్కడికి చేరుకుని పామును పరిశీలించగా, నలుపు–పసుపు చారలతో ఉన్న ఈ పాము *బాండెడ్ క్రైట్ (కట్టువిరియన్)*గా గుర్తించారు. పాము దాదాపు 5 అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పాము విషపూరితమైనదని, సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పాము ఎక్కువగా మహారాష్ట్ర ఏరియాలో ఉంటుంది. అశోక్ నగర్ లో కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

పామును సురక్షితంగా పట్టుకుని పాకాల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ పాములు కనిపించినప్పుడు ప్రజలు వాటిని చంపకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Tags:    

Similar News