Mahabubabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్

Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 110 దరఖాస్తుల స్వీకరణ. అర్జీలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశం.

Update: 2026-08-17 12:26 GMT

Mahabubabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్

మహబూబాబాద్: జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించడానికే ‘ప్రజావాణి’ కార్యక్రమమని, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కుమార్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, డి.ఆర్.ఓ నాగవాని ల తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని అధికారులు అత్యంత బాధ్యతగా స్వీకరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, చట్ట నిబంధనల ప్రకారం అర్హులకు తక్షణమే న్యాయం చేయాలని స్పష్టం చేశారు.

జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు ప్రధానంగా భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ పథకం మరియు స్థానిక మున్సిపాలిటీ, పంచాయతీ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఈ రోజు వచ్చిన కొన్ని దరఖాస్తులలో కేసముద్రం మండలం బేరువాడ కు చెందిన శ్యామల, అదేవిధంగా గార్ల మండలం తిర్లాపురం గ్రామానికి చెందిన మాలోత్ వెన్నెల ఇద్దరు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం గ్రామానికి చెందిన దాట్ల భార్గవ్ నిరుపేద కుటుంబానికి చెందిన తనకు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల 6వ తరగతి ప్రవేశం ఇప్పించగలరని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు, నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అధికారులు తరచూ హాస్టళ్లను సందర్శించి భోజన వసతి, తాగునీరు, పరిశుభ్రత, మెనూ అమలు మరియు విద్యార్థుల హాజరును ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు.

తనిఖీల సమయంలో ఏవైనా లోపాలు లేదా విద్యార్థుల సమస్యలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. నిర్వహించిన తనిఖీల వివరాలతో కూడిన నివేదికను క్రమం తప్పకుండా కలెక్టరేట్‌కు సమర్పించాలన్నారు.ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అర్జీలను సంబంధిత అధికారులు తమ లాగిన్లలో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

అధికారులందరూ ప్రతిరోజూ తమ అధికారిక లాగిన్‌లను తనిఖీ చేసి, పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఫిర్యాదులు లేదా వినతులను అలసత్వంగా వదిలేయకుండా, నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపి డిస్పోస్ చేయాలని అన్నారు. అవసరమైన విషయాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి నిజానిజాలు విచారించిన పిమ్మటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, ఒకవేళ వినతిని తిరస్కరిస్తే దానికి గల సరైన కారణాలను రికార్డు చేయాలన్నారు.

ఈ రోజు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం (110) దరఖాస్తులు వచ్చాయి.ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల వారీగా కంప్యూటరైజ్ చేసి, సంబంధిత అధికారులకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశారు. నిర్ణీత కాలవ్యవధిలోగా వీటికి పరిష్కారం చూపి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో డి.ఆర్.డి ఏ మధుసూధనరాజు, లీగల్ సెల్ అథారిటీ అధికారి అడ్వకేట్ కమల్, సి.పి.ఓ శ్రీనివాస రావు, సర్వే ల్యాండ్ అధికారి శ్రీనివాసరావు, ట్రైబల్ వెల్ఫెర్ అధికారి దేశీరాం, ఎస్.సి కార్పొరేషన్ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, డి.ఏ.ఓ విజయ్ చంద్ర, డి.హెచ్.ఎస్.ఓ మరియన్న, ఇండస్ట్రీస్ అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి కిరణ్, సివిల్ సప్లై అధికారి నరసింహారావు, డి.ఎం.సివిల్ సప్లై అధికారి రమేష్, ఎల్.డి.ఎం యాదగిరి, డి.ఈ.ఓ సత్యనారాయణ మూర్తి, ఇంటర్మీడియేట్ అధికారి మదార్, మహబూబాబాద్ మునిసిపల్ కమిషనర్ వినోద్ కుమార్, ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష, బి.సి వెల్ఫేర్ అధికారి సాయి శ్రీజ, ఎంప్లాయ్మెంట్ అధికారి రజిత, యువజన క్రీడల అధికారి జ్యోతి, మెప్మా అధికారి విజయ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్ లు, ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ యుగేందర్, భూభారతి డిస్ట్రిక్ట్ కో.ఆర్డినేటర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News