Gudur: గూడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నిరసన!
Gudur: పేదలకు అందించే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను హైకోర్టు సాకుతో నిలిపివేసే కుట్రను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
Gudur: గూడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నిరసన!: గూడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నిరసన!
గూడూరు: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) రాష్ట్ర పార్టీ, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యుల ఆదేశాల మేరకు గూడూరు మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వం పేద కుటుంబాల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును హైకోర్టు సాకుగా చూపిస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ (ఎమ్మార్వో) బిఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ మండల మాజీ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ విభాగాల నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.