Kesamudram: కేసముద్రంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' భారీ ర్యాలీ
Kesamudram: కేసముద్రంలో 75 మీటర్ల జాతీయ జెండాతో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు, నాయకులు, విద్యార్థులు.
Kesamudram: కేసముద్రంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' భారీ ర్యాలీ
కేసముద్రం: కేసముద్రంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ 75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేసముద్రం మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ అత్యంత వైభవంగా నిర్వహించారు.
బీజేపీ కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్ మరియు బీజేపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ & జూనియర్ కాలేజ్ ప్రాంగణం నుండి ఈ దేశభక్తి ర్యాలీ ప్రారంభమైంది. భారత దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చేరుకుంటున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, వందేమాతరం గేయం అందించి 150 వసంతాలు పూర్తయిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 75 మీటర్ల భారీ జాతీయ జెండాను విద్యార్థులు, యువకులు, పార్టీ శ్రేణులు చేతబూని ప్రదర్శించారు. దేశభక్తి నినాదాలు, వందేమాతరం ఆలాపనల మధ్య ఈ భారీ ప్రదర్శన స్థానిక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మరియు ప్రభుత్వ హైస్కూల్ మీదుగా ప్రధాన వీధుల గుండా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ తిరంగా యాత్రకు పిలుపునిచ్చారని తెలిపారు.
80వ స్వాతంత్ర్య వేడుకల వేళ, 150 ఏళ్ళ వందేమాతర అమర స్ఫూర్తిని చాటుతూ 75 మీటర్ల సుదీర్ఘ జాతీయ జెండాతో కేసముద్రం వీధుల్లో సాగిన ఈ యాత్ర ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపిందని ఆయన కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన మన జాతీయ జెండా నీడలో దేశ ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ భారీ ర్యాలీలో జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు తిరంగా మండల కన్వీనర్ గడ్డం అశోక్, జిల్లా హర్గర్ తిరంగా కన్వీనర్ ధార హిందూ భారతి, జిల్లా ఉపాధ్యక్షులు పొదిల నరసింహారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు ఓలం శ్రీనివాస్, మున్సిపాలిటీ కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి పాల్గొన్నారు.
లెంకలపల్లి శ్రీనివాస్, బచ్చు లక్ష్మీనారాయణ, ఐత సారయ్య, పూర్ణకంటి భాస్కర్, వెలిశాల సవీన్, భూక్య విజయ్, చంద్రకళ, గాంతి వెంకట్ రెడ్డి, బానోతు రాము, జుజ్జూరు వీరభద్ర చారి, బానోతు రమేష్, సంపత్, చలగోల వెంకటేష్, మూడవత్ అశోక్, వాంగుడోత్ నరేష్, వెలుపుల ఐలయ్య, అనిల్, కుమార్, బానోత్ సురేందర్, విద్యార్థులు, అధ్యాపకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.