Jangaon: ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ జనగామలో SFI ఆందోళన
Jangaon: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని జనగామ కలెక్టరేట్‌ను ముట్టడించిన SFI విద్యార్థులు. రాష్ట్రవ్యాప్త ఉద్యమ హెచ్చరిక.
Jangaon: ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ జనగామలో SFI ఆందోళన
జనగామ: విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో SFI ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యాశాఖను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని SFI నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందని మండిపడ్డారు.
బకాయి ఫీజులను వెంటనే విడుదల చేయాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.