Elkathurthy: ఎల్కతుర్తిలో కారు డిక్కీలో యువతి మృతదేహం లభ్యం
Elkathurthy: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో గోదావరిఖనికి చెందిన మానస మృతదేహం లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Elkathurthy: ఎల్కతుర్తిలో కారు డిక్కీలో యువతి మృతదేహం లభ్యం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో గుర్తుతెలియని యువతి మృహదేహం మండల కేంద్రంలో కలకలం సృష్టించింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు కారు డిక్కిలోంచి మృతదేహాన్ని బయటకు తీసి కారు సోడా చేయగా మృతురాలి ఆధార్ కార్డు ద్వారా ఆచూకీ వివరాలు లభించాయి గోదావరిఖని పట్టణానికి చెందిన అంకతి మానస గా పోలీసులు గుర్తించారు.
మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు స్థలానికి చేరుకుని తమ కూతురే అని నిర్ధారించారు.మనసా తల్లిదండ్రులు తన కూతురుకి వినయ్ అనే స్నేహితుడు వున్నాడు ఆదివారం తనతో అరుణాచలం వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్ళింది ఇంతలోనే ఇలా జరిగిందని సమాచారం తెలిసిందని తెలిపారు.
గ్తన స్థలాన్ని సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు పోలీస్ అధికారులు.