Bhupalpally: చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశం.
Bhupalpally: చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
Bhupalpally: చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి, సాదా బైనామా, బల్క్ ల్యాండ్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాదా బైనామా 2,325, భూ భారతి 93 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నందున త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
సర్వే ప్రక్రియలో నోటీసులు జారీ చేసి, ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. పూర్తయిన బల్క్ ల్యాండ్ సర్వేపై సమగ్ర నివేదికలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ వసంతరావు, సిబ్బంది పాల్గొన్నారు.