Bhupalpally: హమీలు అమలు చేయకపోతే సమ్మె తప్పదు ..AITUC హెచ్చరిక!
Bhupalpally: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని AITUC ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు. భూపాలపల్లిలో విలేకరుల సమావేశం.
Bhupalpally: హమీలు అమలు చేయకపోతే సమ్మె తప్పదు ..AITUC హెచ్చరిక!
Bhupalpally: సింగరేణి యాజమాన్యం ఈనెల 27 వరకు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే అన్ని జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేయడం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ..
కార్మికులకు పనిముట్ల ఏర్పాటు చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం యుద్ధం వల్లనే పనిముట్ల కొరత టెండర్లు నిలిచిపోవడం వల్లనే పనిముట్లు అందడం లేదని కారణం చెబుతుంది అన్నారు.
అరిగిపోయిన పనిముట్లతో కోయలేక కార్మికుల రి శరీరంపై భారం పతూ కార్మికులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పెరుగ్స్ పై ఇన్కమ్ టాక్స్ విషయంలో తప్పకుండా అమలు చేయాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేయడం జరిగిందన్నారు. దీన్ని సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్న కానీ 65 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అనుమతి కావాలని కోరడం జరిగిందన్నారు. రాజకీయ కారణం వల్లనే ఇలాంటి ఒప్పందాలు అమలు కావడం లేదని చెప్పారు.
డిస్మిస్ కార్మికులకు సంబంధించి 7 గురితో కమిటీ వేయడం జరిగిందని, మెడికల్ బోర్డు కు సంబంధించి నెలకొకసారి పాత విధానంలో కొనసాగిస్తామని, ఈనెల 25, 26న మెడికల్ బోర్డు ఉండబోతుందన్నారు. మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్ లు అండర్ గ్రౌండ్ అండ్ ఫీట్ అయితే సూటబుల్ జాబు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు.