Bhupalpally: భూపాలపల్లి మైన్స్ ఏడీఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ జయరాజ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. కలెక్టరేట్‌లోని ఆఫీసులో రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు.

Update: 2026-08-27 07:01 GMT

Bhupalpally: భూపాలపల్లి మైన్స్ ఏడీఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు!

Bhupalpally: ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్‌ ఏడీఈ జయరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో చేపట్టిన తనిఖీల్లో పలు కీలక రికార్డులు, దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆస్తులకు సంబంధించిన వివరాలు, అధికారిక రికార్డులను ఏసీబీ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Tags:    

Similar News