Vizianagaram: పాఠశాలల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన!
Vizianagaram: విజయనగరం జిల్లా వేపాడ మండలం బొక్కునాయుడుపేటలో కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్‌లను డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఈవో మాణిక్య నాయుడు సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు.
Vizianagaram: పాఠశాలల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన!
Vizianagaram: వేపాడ మండలంలోని బొక్కు నాయుడుపేటలో పాఠశాలలను సందర్శించిన డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ గొంప క్రిష్ణ గారు. బొక్కు నాయుడుపేటలోని కేజీబీవీ పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్, అలాగే దబ్బిరాజుపేట పాఠశాలలను విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ మాణిక్య నాయుడు గారితో కలిసి సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, తరగతి గదులు, తాగునీరు, పారిశుధ్యం, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను పరిశీలించడం జరిగింది.విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యను అభ్యసించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.