Off The Record: కాకినాడలో కాక రేపుతున్న కాపుల సపోర్ట్
Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం కేంద్రంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
Off The Record: కాకినాడలో కాక రేపుతున్న కాపుల సపోర్ట్
Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం కేంద్రంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాపు పాలిటిక్స్, ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఎప్పుడూ హాట్ టాపికే. రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకుగా ఉన్న ఈ సామాజిక వర్గం మెప్పు పొందెందుకు పార్టీలు వేసే ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకినాడ జిల్లా కేంద్రంగా కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయి.
సాయికృష్ణ లాకప్‌డెత్ ఉదంతం తర్వాత జరుగుతున్న పరిణామాలు, కాకినాడలో కులాలపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. మళ్లీ కాపు సెంటిమెంట్‌ను రగిల్చాయి. దీంతో కాపు సామాజిక వర్గంలో వచ్చిన వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని వైసిపి గేమ్ స్టార్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే.. వైసిపికి చెందిన కాపు నేతలు సమావేశం పెట్టారా..? గతంలో వైసీపికి కలిసొచ్చిన కాపులు..మళ్లీ మద్దతు ఇస్తారా..?