Off The Record: శ్రీకాకుళం టీడీపీలో అంతర్యుద్ధం
Off The Record: శ్రీకాకుళం టీడీపీలో కలకలం రేగుతోంది. దివంగత అప్పల సూర్యనారాయణ విగ్రహ ఏర్పాటును సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Off The Record: శ్రీకాకుళం టీడీపీలో అంతర్యుద్ధం
Off The Record: రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన గురువు అతను. పార్టీయే నా శ్వాస అంటూ తుది శ్వాస వరకూ అదే నిజాయితీ. అంతటి మహానాయకుడి విగ్రహం పెడతామని వారుసులు ముందుకొస్తే.. ఇప్పడు ఎందుకంటూ కొందరు సొంత పార్టీ నేతలే అడ్డుపడుతున్నారట. ఈ ఇష్యూ ఇప్పుడు చినికి చినికి ఆ పార్టీ ప్రతిష్టపై పడిందట. మరోవైపు అధికారులు కూడా ఉలిక్కిపడి సరిదిద్దడానికి చర్యలు చేపడుతున్నారట.
అధికారులు అనుమతి ఇచ్చినా విగ్రహ పిల్లర్లను ధ్వంసం చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా..? విగ్రహ రాజకీయం వెనుక ఉన్నదెవరు..? ఆ మహానాయకుడిని అవమానిస్తున్న శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పరా..? ఇంతకీ ఎవరా దివంగత మహా నేత? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్.