Jordar News: అది నా పిల్లరా..!

Jordar News: విజయవాడ నడిరోడ్డుపై సినిమాలను తలపించేలా జరిగిన కార్ల ఫైటింగ్ మరియు యువకుల గుద్దులాట సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది.

Update: 2026-05-23 01:48 GMT

Jordar News: అది నా పిల్లరా..!

Jordar News: ఏహే.. హాలీవుడ్ యాక్షన్ సీన్లకు ఏమాత్రం తక్వలేదు గదా ఈసీను. కార్లతోని తగ్గాఫర్ ఫైటింగ్ జేస్తున్నరు. బంగారమసొంటి కార్లు సొట్టువోతున్నయన్న శిగ్గు ఇసుమంత గూడ లేదు ఈల్లకు. నన్నే గుద్దుతవా అంటే.. నన్నే గుద్దుతవా అనుకుంట ఎన్కకు పొయ్యి మరీ ముంగటికచ్చి కార్లతోని గుద్దుకుంటున్నరు. విజయవాడ కాడ పటమట దిక్కున్న హైటెన్షన్ రోడ్డుల ఈ హైటెన్షన్ సీన్ కానొచ్చింది. రోహిత్, ఓమ్ అనే ఇద్దరు యూత్ పోరలు ఒగ అమ్మాయి ముచ్చట్ల పెట్టుకున్న పంచాది.. ఇట్ల రోడ్ల మీద ఆంబోతుల్లెక్క కార్లతోని కొట్టుకునే కాడికి తెచ్చింది. కార్లల్ల పందుల్లెక్క కాదురా.. గల్లీల దున్నపోతుల్లెక్క.. నీ ప్రతాపమో.. నా ప్రతాపమో సూస్కుందాం రారా అన్నట్టే, కార్లల్ల కెంచి దిగి గుత్పలతోని గూడ సంపుకున్నరు. ఇగ అసుంట పోయ్నోల్లు.. హాలీవుడు, బాలీవుడు, టాలీవుడు సీన్లను మిక్సింగ్ కొట్టి విజయవాడ గల్లీలల్ల ఫ్రీగ సూపెడ్తున్నరని, కెమ్రాలు తీశి వీడియోలల్ల బందించిర్రు. తొవ్వల మీద ఇప్పటిదాంక ఆంబోతుల కొట్లాటలే సూశిర్రు, బట్ ఫర్ ఏ ఛేంజ్ బగ్గబల్శినోల్ల కార్ల కొట్లాటలు సూడుర్రని, వీడియోలను ఇంటర్నెట్ల ఇడుస్తె.. కార్ల కంటే ఇస్పీడుగ వైరలైనయ్. అప్పటికే.. లైవుల సూశ్నోల్లు పోలీసోల్లకు ఫోన్ కొట్టంగనే వాళ్లచ్చి, ఇంకింత రచ్చజెయ్యకుంట ఆపిర్రు. ఠానాకు తోల్కపోయిర్రు. ఈముచ్చట మీద ఎంక్వైరీ జేస్తున్నరట కనీ., పోలీస్ మంత్రి అనితక్కా.. పర్పతుందని, సందులల్ల పందుల్లెక్క కొట్లాడే ఇసొంటోల్లను ఉత్తగనే ఇడ్శిపెట్టకుర్రి. కటకటాల పాల్జేశి, మల్లోతాప ఇట్ల జెయ్యాల్నంటెనే వన్కు వుట్టెతట్టు జెయ్యుర్రని ఒక్క తీర్గ కోరవట్టిర్రు విజయవాడ జనాలు.


Full View

Tags:    

Similar News