Hyderabad: హైదరాబాద్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్‌

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య తనూజ హత్య కేసులో సంచలన ట్విస్ట్ వెలుగుచూసింది.

Update: 2026-05-22 08:33 GMT

Hyderabad: హైదరాబాద్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్‌

Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ భార్య తనూజ హత్య కేసులో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. పనిమనిషి కల్పనతో పాటు ముఠాలో మరో ఏడుగురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. నేపాలీ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబైలో పట్టుబడ్డ సునీల్‌ పర్యార్‌ను విచారించి కీలక విషయాలు రాబట్టారు. సునీల్‌ పర్యార్‌ సమాచారంతో ముంబైలో తులం బంగారం రికవరీ చేసుకున్నారు.

అయితే.. గ్యాంగ్‌లోని ముగ్గురు సభ్యులు ఇప్పటికే సరిహద్దు దాటి నేపాల్‌ వెళ్లినట్టు గుర్తించారు. మరో ముగ్గురు వివిధ మార్గాల్లో దేశం దాటి ఉండొచ్చని పోలీసుల అంచనా వేస్తున్నారు. ఈ నెల 8న రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ భార్య తనూజ దారుణహత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో తనూజను నేపాలీ గ్యాంగ్‌తో కలిసి పనిమనిషి దారుణంగా హత్యచేసింది. అనంతరం.. నగదు, బంగారు ఆభరణాలతో ముఠా సభ్యులు పరారయ్యారు.

Full View


Tags:    

Similar News