Burning Topic: శాశ్వతంగా బ్రిటన్ రానున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్!

Burning Topic:బ్రిటన్ రాజకుటుంబానికి దూరంగా అమెరికాలో ఉంటున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెట్ దంపతులు మళ్లీ బ్రిటన్‌కు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

Update: 2026-08-22 01:52 GMT

Burning Topic: శాశ్వతంగా బ్రిటన్ రానున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్!

Burning Topic: యునైటెడ్ కింగ్‌డమ్ రాజకుటుంబంలో ఏం జరిగినా అతి పెద్ద వార్తే అవుతుంది. తాజాగా కింగ్ ఛార్లెజ్ -3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెట్, వీరి ఇద్దరి పిల్లలు త్వరలోనే బ్రిటన్‌కు తిరిగి వచ్చేస్తున్నారు.

2020లో ప్రిన్స్ హ్యారీ తన కుటుంబంతో కలిసి దేశాన్ని విడిచిపోయారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల మాంటెసిటోలో నివసిస్తున్నారు. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌లో తమ తాత ప్రిన్ప్ ఫిలిప్ మరణించినప్పుడు అంత్యక్రియల కోసం.. 2021 జూలై‌లో తల్లి ప్రిన్సెస్ డయానా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి..

2022 జూన్‌లో క్వీన్ ఎలిజబెత్ పాలన ప్లాటినం జూబ్లీ వేడుకలకు.. అదే ఏడాది సెప్టెంబర్‌తో ఆమె మరణంతో అంత్యక్రియలకు హాజరయ్యారు.. మళ్లీ 2023 మేలో తండ్రి కింగ్ ఛార్లెజ్ -3 పట్టాభిషేక మహాత్సవానికి వచ్చారు.

ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు ఇక ఎక్కువ కాలం బ్రిటన్‌లోనే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకొని తిరిగి స్వదేశానికి రావాలని నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు కుటుంబంతో సహా బ్రిటన్‌ను ఎందుకు వదిలేశారు? తిరిగి ఎందుకు వచ్చేయాలిన కోరుకుంటున్నారు? అనేది మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. దీని వెనుక పెద్ద కథే ఉంది.

బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌-3, డయానాల సంతానమే విలియం, హ్యారీ.. 1997లో తల్లి డయానా ప్రమాదంలో మరణించింది మొదలు ఈ రాజ కుటుంబం నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చింది. కాగా 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కుటుంబంలో విబేధాలకు దారి తీసింది.

ఆయన అమెరికన్ నటి మార్కెల్‌ల వివాహం చేసుకోవడం రాజ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు.మేఘన్‌ను పెళ్లి చేసుకోవద్దని విలియమ్ తన తమ్ముడు హ్యారీని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఇది అన్నదమ్ముల మధ్య క్రమంగా దూరాన్ని పెంచింది.

వివాహం తర్వాత మేఘన్‌కు, తోటి కోడలు కేట్ మిడిల్టన్ మధ్య తరచూ మనస్పర్ధలు వచ్చాయి. రాజ కుటుంబ సభ్యులంతా తన పట్ట వివక్ష చూపిస్తున్నారని ఆమె తరచూ బాధపడేదని చెబుతారు రాజ కుటుంబంలోని ఈ విబేధాలు క్రమంగా బయటపడి బ్రిటన్ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

ప్రిన్స్ హ్యారీ–మేఘన్‌ దంపతులు 2020 జనవరిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకుటుంబంలో సీనియర్‌ సభ్యులుగా తమ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

అనంతరం వారు అమెరికాకు వెళ్లిపోయి అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మేఘన్‌ రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అనేక సార్లు బహిరంగంగా మాట్లాడారు. హ్యారీ కూడా తన తండ్రి కింగ్‌ చార్లెస్‌, అన్న ప్రిన్స్‌ విలియమ్‌తో విబేధాలను బయటకు చెప్పుకున్నారు.. 2023లో విడుదలైన హ్యారీ ఆత్మకథ ‘స్పేర్‌’లో విలియమ్‌తో విభేదాలను ప్రస్తావించడం మరింత సంచలనంగా మారింది.

తన భార్యను కుటుంబ సభ్యులు మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. తండ్రి, అన్న తన పట్ల దారుణంగా వ్యవహరించారని, అయినప్పటికీ వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు

కాగా రాకుమారులు విలియమ్స్, హ్యారీలకు కలిపే ప్రయత్నాలు. జరిగాయి. హ్యారీ అన్నతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా విలియమ్‌ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదనే ప్రచారం ఉంది. హ్యారీ ఒక్కడిగా వస్తేనే తాను మాట్లాడతానంటూ విలియమ్‌ షరతు పెట్టినట్లు కథనాలు ఇచ్చాయి.

హ్యారీ నేను చిన్నతనంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నానని ఒక సందర్భంలో విలియమ్స్ చెప్పారు. 2022 సెప్టెంబర్‌లో నాన్నమ్మ క్వీన్‌ ఎలిజబెత్‌ మరణించిన సమయంలోనూ ఈ ఇద్దరు కలుసుకుంటారనే ప్రచారం జరిగింది.

ఆ మధ్య తండ్రిని కింగ్‌ చార్లెస్‌-IIIని చూడడానికి వచ్చిన సమయంలోనూ అన్నతో హ్యారీ భేటీ అవుతాడనే ప్రచారమూ జరిగింది. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మళ్లీ బ్రిటన్‌కు తిరిగి వస్తుండటంతో ఈ విభేదాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. విలియమ్స్, హ్యారీలు తిరిగి కలుసుకుంటారనే చర్చ జరుగుతోంది

క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణం అనంతరం ఆమె కుమారుడు రాజుగా ఛార్లెస్‌-3కు పట్టాభిషేకం జరిగింది. బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ఆయన 40వ చక్రవర్తి. ఆయన రెండో భార్య క్యామిల్లా యూకే రాణిగా బాధ్యతలు చేపట్టింది.

మూడు రోజులు పాటు జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు మాత్రమే ప్రిన్స్‌ హ్యారీ దంపతులు హాజరయ్యారు. ఆ తర్వాత తిరిగి అమెరికా వెళ్లిపోయారు. కాగా ఇప్పుడు ఈ దంపతులు స్వదేశానికి తిరిగి రావాలని కోరుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి కింగ్ చార్లెస్‌కు దగ్గరగా ఉండాలని హారీ కోరిక. మరోకరి పిల్లల చదువులు. హ్యారీ-మేగన్‌ల పిల్లలు ఆర్చీ, లిలిబెట్‌ల పెంపకం ఎక్కువగా అమెరికాలోనే సాగింది.

ప్రస్తుతం వారిద్దరినీ బ్రిటన్‌లోని ఓ పాఠశాలలో చేర్పించారని, సెప్టెంబర్ నుంచి వారి తరగతులు ప్రారంభం కానున్నాయని సమాచారం. ఈ నెలాఖరులో వీరు బ్రిటన్‌కు వస్తారని తెలుస్తోంది మరోవైపు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ బ్రిటన్‌కు తిరిగి రావడం కేవలం తమ వ్యక్తిగత అవసరాల కోసమా? లేక రాజకుటుంబంతో సంబంధాల పునరుద్ధరణకు అడుగులా? అనే చర్చ మొదలైంది.

అయితే హ్యారీ–మేఘన్‌ రాజకుటుంబానికి చెందిన ‘వర్కింగ్‌ రాయల్స్‌’గా మాత్రం తిరిగి వ్యవహరించబోరని తెలుస్తోంది. ఇకపై కూడా ‘నాన్‌ వర్కింగ్‌ రాయల్స్‌’గానే కొనసాగనున్నారు. రాజకుటుంబ అధికారిక కార్యక్రమాల్లో వారికి మళ్లీ కీలక పాత్ర ఉండకపోవచ్చని సమాచారం.

వీరు రాజభవనంలో కాకుండా ప్రత్యేక నివాసంలో ఉండే అవకాశం ఉందని బ్రిటన్‌ పత్రికలు చెబుతున్నాయి. మరోవైపు రాజకుటుంబ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత హ్యారీకి బ్రిటన్‌లో కల్పించే భద్రతపై గతంలో వివాదం చెలరేగింది.

దీనిపై కోర్టులో పోరాడిన హ్యారీకి అనుకూల ఫలితం రాలేదు. తండ్రి కింగ్‌ చార్లెస్‌తో సంబంధాలు కొంత మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే అన్న ప్రిన్స్‌ విలియమ్‌తో ఉన్న దూరం ఇంకా కొనసాగుతోంది.

Full View
Tags:    

Similar News