News Anlysis: రైతు బంధు రీ-డిజైన్ అవసరం.. బడా శ్రీమంతులకు చెక్ పెట్టాలి!
News Anlysis: రైతులకు సబ్సిడీలు ఇవ్వాల్సిందే కానీ అర్హులకు మాత్రమే అందాలని బిజెపి నేత విట్టల్ అన్నారు.
News Anlysis: తెలంగాణ హైకోర్టు ఇటీవల ఉచిత పథకాలు, అర్హతలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై నిర్వహించిన హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) పొలిటికల్ న్యూస్ ఎనాలసిస్‌లో బీజేపీ నాయకుడు విట్టల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక అయిన రైతులకు ప్రభుత్వం ఎంత సాయం చేసినా తక్కువేనని, అయితే సంక్షేమ పథకాలు నిజమైన నిరుపేదలకు, అవసరమున్న వారికే దక్కేలా 'రేషనలైజేషన్' (వర్గీకరణ/సమగ్ర సమీక్ష) జరగాలని స్పష్టం చేశారు.
వ్యవసాయం ఫ్యాక్టరీ ఉత్పత్తుల వంటిది కాదని, అర్ధరాత్రి కష్టపడే రైతులకు విదేశాల తరహాలోనే 100% సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, అలాగే లగ్జరీ కార్లు ఉన్న బడా శ్రీమంతులకు కూడా రైతు బంధు చెక్కులు ఇవ్వడం పెద్ద లోపమని విమర్శించారు.