Off The Record: తాడిపత్రిలో పొలిటికల్ వార్.. గోవా లిక్కర్‌తో మళ్లీ రగిలిన రగడ!

Off The Record: తాడిపత్రిలో గోవా మద్యం వివాదం, వైసీపీ-టీడీపీ నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లతో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Update: 2026-08-25 03:37 GMT

Off The Record: తాడిపత్రిలో పొలిటికల్ వార్.. గోవా లిక్కర్‌తో మళ్లీ రగిలిన రగడ!

Off The Record: ఏపీలో అన్ని నియోజకవర్గాలు ఒక్క ఎత్తు అయితే.. తాడిపత్రి రాజకీయాలు మరో ఎత్తు. ఎవరు పవర్‌లో ఉన్నా..పగలు, ప్రతీకార రాజకీయాలే ఇక్కడ రాజ్యమేలుతుంటాయి. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా... ఏ చిన్న వివాదం తలెత్తినా అది కాస్త రాజకీయ రంగు పలుముకోవడం... కీలక నేతలు రోడ్లపైకి రావడం పరిపాటిగా మారుతోందట.

రెండు వర్గాలను కట్టడిచేయడంలో పోలీసులు నానా అవస్థలు పడుతున్నారట. తాడిపత్రిలో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తూన్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ దాదాపు ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయి.

ఇటు వైసీపీలో.. నియోజకవర్గ ‎ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూన్నారు. ప్రతిపక్షానికి అన్నీ తానై వ్యవహరిస్తూన్నారు. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఇద్దరి మధ్య నెలకొన్న వైరం తారాస్థాయికి చేరడంలో ప్రతిదీ వివాదం అవుతోందట.

ఇటీవల తాడిపత్రిలో పెద్ద ఎత్తున గోవా మద్యం లభ్యమైంది. ఈ విషషయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాడిపత్రిలో గోవా మద్యం లభ్యం కావడంపై వైసీపీ, టీడీపీ ఎవరికి వారు ప్రత్యర్థులపై విమర‌్శలకు దిగారు. ఏకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై మండిపడ్డారు.

లారీల కొద్దీ అక్రమ మద్యం తెచ్చి అమ్ముతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ వాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. లిక్కర్ పట్టుబడిన కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాను ఆందోళనకు దిగడం లేదని... విచారణకు ఇబ్బంది కలగకూడదు అనే సైలెంట్ గా ఉన్నామని చెప్పుకొచ్చారు.

అంతకు ముందు వైసీపీ నేతలతోనే కమిటీ వేసి విచారణ చేపట్టాలని... నిజాలను నిగ్గుతేల్చాలని జేసీ డిమాండ్ చేశారు. తాడిపత్రి వైసీపీ ఇంచార్జి పెద్దారెడ్డి మాత్రం ప్రభుత్వమే మంత్రులతో కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూన్నారు. తాడిపత్రిలో జరుగుతున్న

అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జరుగుతున్న అక్రమాలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని పెద్దారెడ్డి డిమాండ్ చేస్తూన్నారు.. నియోజకవర్గంలో 24 మంది వైసీపీ నేతలను ప్రత్యర్థులుగా భావిస్తూ వారి అంతు చూస్తాం అని బెదిరిస్తూన్నారని..

స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పెద్దారెడ్డి ఆరోపిస్తూన్నారు. అంతకు ముందు డీఎస్సీలో అక్రమాలపై వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పెద్దారెడ్డి ఆధ‌్వర్యంలో చేపట్టిన ఆందోళనలు వివాదాస్పదంగా మారాయి. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పేరుతో టీడీపీ పోటీగా కార్యక్రమాలు కొనసాగించడంతో రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ రాజుకుంది.

యాడికి, పెద్దవడగూరు, పెద్ద పప్పూరులో పోటా పోటీ కార్యక్రమాలు జరిగినా... తాడిపత్రిలో తలపెట్టిన ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పట్టణంలో పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉందని.. శాంతి భద్రతలకు భంగం కలగనుందని పోలీసులు రెండు పార్టీల నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు.

పెద్దారెడ్డితో పాటు వైసీపీ నేతలను ఇళ్లకే పరిమితం చేశారు. పట్టణంలోకి వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పోలీసు బలగాలు మొహరించారు. అంతకు ముందు వైసీపీ నేతల అక్రమాలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా పోలీసు స్టేషన్ ముందు నిరసన చేపట్టడంతో పోలీసు అధికారులు సర్ధిచెప్పి పంపారు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం దాదాపు రెండేళ్లు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోకి వస్తే అడ్డుకుంటామని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెప్పడంతో పాటు లా అండ్ ఆర్డర్ వివాదం తలెత్తుతుందని పోలీసులు ఆయనను అనుమతించలేదు.

చివరికి కోర్టు జోక్యంతో తాడిపత్రిలో ఉంటున్నారు. పెద్దారెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రాజకీయ ఆరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో జేసీ కుటుంబంపై సుమారు వంద కేసులు నమోదు కావడంతో పాటు వారి వ్యాపారాలు దెబ్బతినడానికి పెద్దారెడ్డి కారణం అయ్యాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తూన్నారు.

దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సుల కొనుగోలు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై పెద్దారెడ్డి ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసులు నమోదు చేశారు. జేసీ కుటుంబంపై కేసులు నమోదు కావడంతో పాటు ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కడప కారాగానికి వెళ్లి వచ్చారు.

అప్పట్లో జేసీ కుటుంబంపై పెద్దారెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తూన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి.. జేసీ ఇంటికి వెళ్లిరావడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందట.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తరుణంలో పెద్దారెడ్డికి పూర్తీగా చెక్ పెట్టాలని జేసీ వర్గీయులు భావిస్తూన్నారట. గతంలో జేసీ కుటుంబంపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించారని... టీడీపీ నేతలు, కార్యకర్తలపై వందల కేసులు నమోదు చేసి

జైళ్లకు పంపారని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. తాను వైసీపీకి, ఆ పార్టీ నేతలకు వ్యతిరేకం కాదని...కేవలం పెద్దారెడ్డికి మాత్రమే వ్యతిరేకం అని జేసీ ప్రభాకర్ రెడ్డి పదేపదే చెబుతున్నారు.  సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే నేతల మధ్య వివాదం కొనసాగుతుంది. ఏ చిన్న అంశమైనా రాజకీయ నేతలు సీరియస్ గా రియా

Full View
Tags:    

Similar News