Off The Record: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం?

Off The Record: జనసేన పార్టీలో భారీ మార్పులకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్! ఏపీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా అధ్యక్షుల వరకు అందరినీ మార్చే దిశగా కసరత్తు.

Update: 2026-05-09 01:13 GMT

Off The Record: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం?

Off The Record: జనసేనలో ఇక ఫుల్ ఫోకస్ ఆర్గనైజేషన్‌పైనే పెట్టినట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో కూటమి విజయంతో ప్రభుత్వ బాధ్యతలు పెరగడంతో పాటు.. పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావిస్తోంది. అందుకే వచ్చే వారంలోనే కొత్త కమిటీల ప్రకటనకు రంగం సిద్ధమైందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా అధ్యక్షుల వరకు భారీ మార్పులు ఉండొచ్చని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పార్టీ కోసం గ్రౌండ్ లెవల్‌లో పని చేసిన నాయకులకు ఈసారి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పనిచేసిన వారికి కీలక పదవులు ఇవ్వాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. కేవలం పేరుకే పదవులు కాకుండా... ప్రజల్లో పనిచేసే వారికే బాధ్యతలు ఇవ్వాలని స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఏపీలో 175 నియోజకవర్గాలకు ఇంచార్జీల నియామకం కూడా ఈసారి కీలకంగా మారింది. ఎన్నికల సమయంలో యాక్టివ్‌గా ఉన్న నేతలు, స్థానికంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వారిపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఇంచార్జీలను మార్చే అవకాశమూ ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో యువత, సోషల్ మీడియా యాక్టివిస్టులకు కూడా ప్రాధాన్యం పెరగొచ్చని అంటున్నారు.

కూటమి ప్రభుత్వంలో భాగమైన తర్వాత జనసేన భవిష్యత్ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం ఎన్నికల పార్టీగా కాకుండా.. శాశ్వత రాజకీయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ఈ మార్పులు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లాల వారీగా పార్టీ బలం, బూత్ స్థాయి నిర్మాణం, కేడర్ యాక్టివిటీపై ప్రత్యేక నివేదికలు తీసుకున్న తర్వాతే కమిటీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం.

మొత్తానికి జనసేనలో రాబోయే రోజులు రాజకీయంగా చాలా కీలకంగా మారబోతున్నాయి. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి అవకాశం దక్కుతుంది..? ఎవరికి షాక్ తగులుతుంది..? ఏ జిల్లాలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? అన్నదానిపై జనసేన శ్రేణుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పుడు అందరి చూపు జనసేన అధిష్టానం ప్రకటించబోయే కొత్త జాబితాపైనే ఉంది. పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్న బలం టానిక్‌తో జనసేన పార్టీ ఏమరకు బలోపేతం కానుందో చూడాలి.


Full View

Tags:    

Similar News