Jordar Varthalu: ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి సార్?

Jordar Varthalu: మైసూరు మున్సిపాలిటీ అధికారుల వినూత్న ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!

Update: 2026-05-07 02:15 GMT

Jordar Varthalu: ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి సార్?

Jordar Varthalu: వారెవ్వా.. అచ్చం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లల్ల పెట్టే అద్దాల్లెక్కనే ఉన్నయ్ గదా. అపార్టుమెంట్ సెల్లార్ మూల మలుపుల కాడ టక్కర్లు గాకుంట జూమ్ల కన్పిచ్చే జూమ్ అద్దాలో.. గల్లీలల్ల టక్కర్లు గాకుంట ఏర్పాటు జేశ్న నిలువుటద్దాలో అనుకుంటే.. బరాబర్ తప్పుల కాలేశ్నట్టే అయితదుల్లా. మరి ఇంట్ల సూస్కునెతందుకు వాడే వాటిని తొవ్వల మీద గోడలకు పెట్టిర్రు ఎందుకంటే.. పుండెక్కడుందో, మందు అక్కన్నే ఏశే పనిముంగటేసుకున్నరు కర్ణాటక దిక్కు మున్సిపాల్టోల్లు. మైసూర్ దిక్కున్న తొవ్వల మీద కామన్ పబ్లిక్కు ముక్కు ముయ్యకుంట నడ్శే పరిస్థితి లేదట. దినాం తొవ్వలమీదనే ఒంటికి పోతున్నరట అటు దిక్కు జనాలు. గోడలను సూడంగనే.. కనికరం లేకుంట కంపును నింపుతున్నరట.

అటు దిక్కు మున్సిపాల్టోల్లు బహిరంగంగ మూత్రం పొయ్యద్దని, ముగ్గులేశి ముద్దుగ రాశినా.. పోస్తే 5వందల రూపాల ఫైనని రాశిపెట్టినా.. ఎవలు పట్టిచ్చుకుంటలేరట. ఎవల పని వాళ్లదే. గోడకు చెప్పన్నట్టే చేత్తున్నరట. ఇగ ఇట్లైతే కల్వదని మైసూర్ మున్సిపాల్టోల్లు బగ్గ ఆలోచన జేశి అద్దాల ఉపాయాన్ని అమల్జేశిర్రు. ఒంటెలుకు పోయ్నోల్లకు ఆల్లకు ఆల్లే అద్దాలల్ల కనిపిచ్చి, ఎన్కున్నోల్లకు సుతం కనిపిచ్చే తీరు గోడలకు అద్దాలు పెట్టిర్రు. ఈడ తప్పుడు పన్జేస్తున్నం. మనకు మనమే మారాలని, తెల్వికచ్చే ఉపాయమట ఇది. తిడ్తె మారనోడు తంతె మార్తడా అన్నట్టు.. శిగ్గులేకుంట తొవ్వల మీద పోశెటోల్లు, మందికి కనవడ్తున్నమని పోసుడు ఆపుతరో సూడాలె మరి. ఇంట్లకు పనికత్తయని, ఎవలు లేనిది సూశి కొంచవోయెటోల్లు సుతం మనతాన మస్తు మందే ఉంటరు. కనీ., ఇట్ల ఉత్తుత్తగ పైసలు ఖర్సు వెట్టే కంటే.. పబ్లిక్ తిర్గే జాగలల్ల పుక్యానికి టాయిలెట్లు వెట్టి, వాటి సుచీశుభ్రతకు ఖర్సు వెడ్తే మంచిగుండు కావచ్చని అనుకోవట్టిర్రు ఈ వైరల్ వీడియోను సూశ్న జనాలు.


Full View

Tags:    

Similar News