Burning Topic: చక్రం తిప్పిన మోడీ..భారత్- అమెరికా మధ్య కీలక ఒప్పందాలు
Burning Topic: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పర్యటన విశేషాలు. ప్రధాని మోదీతో భేటీ, తాజ్‌మహల్ సందర్శన.
Burning Topic: చక్రం తిప్పిన మోడీ..భారత్- అమెరికా మధ్య కీలక ఒప్పందాలు
Burning Topic: భారత్‌తో తమ బంధం మరింత బలపడుతోందని చెబుతోంది అమెరికా. వాణిజ్యం విషయంలో భారత్‌తో ఘర్షణకు దిగే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో స్పష్టం చేశారు. తమ వీసాల విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఏ దేశానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. భారత్‌తో దీర్ఘకాల సంబంధాలను కొనసాగిస్తామన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్- అమెరికా నిరంతరం కలిసి పనిచేస్తాయని రుబియోతో జరిగిన భేటీలో తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా ఫోన్ చేసి భారత్ పట్ల, ప్రధాని మోదీపై అభిమానాన్ని చాటుకోవడం విశేషం.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పర్యటన సందడిగా కొనసాగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆయన తన భార్య జెనెట్ రుబియోతో కలిసి తొలిసారిగా భారత్ వచ్చారు. 2012లో హిల్లరీ క్లింటన్ తర్వాత కోల్‌కతాలో అడుగుపెట్టనున్న అమెరికా విదేశాంగ కార్యదర్శిగా రూబియో నిలిచారు. ఇటీవలే బీజేపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి రుబియో పర్యటన ప్రారంభం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తర్వాత ఆగ్రాలోని ప్రపంచ ప్రసిద్ధ తాజ్‌మహల్‌ను సందర్శిచి మైమరచిపోయారు. తమ భారత పర్యటనలో భాగంగా రుబియో దంపతులు చారిత్రిక జైపూర్ నగరాన్ని కూడా సందర్శించి అంబర్ ప్యాలస్‌ను తిలకించారు. రుబియో దంపతులు. వీరితో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా ఉన్నారు. వీరి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మార్కో రూబియో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నాయకుల మధ్య చర్చలు సాగాయి. ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు. పశ్చిమాసియాలోని పరిస్థితిపై అమెరికా దృక్పథాన్ని రూబియో మోదీకి వివరించారు. ఈ సమస్యను చర్చలు, దౌత్యం ద్వారా శాంతియుత పరిష్కారానికి భారత్ నిరంతరం మద్దతు ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్- అమెరికా నిరంతరం కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో భారత్- అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొనసాగుతున్న పురోగతితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి భద్రత అంశాలపై చర్చించామని. ప్రపంచ మేలు కోసం భారత్, అమెరికా కలిసి పనిచేయడం కొనసాగిస్తాయి" అని ప్రధాని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా రాయబారి సెర్జియో గోర్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తమ రాయబారి సెర్గియో గోర్‌కు ఆకస్మికంగా కాల్ చేయగా ఆయన అందరికీ ఆడియో వినిపించారు. "ఐ లవ్ ఇండియా.. అందరికీ నమస్కారం అంటూ పలకరించారు ట్రంప్. నాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటే చాలా ఇష్టం. మోదీ గొప్పవారు. ఆయన నా స్నేహితుడు. మేం భారత్ గతంలోకన్నా ఇప్పుడెంతో సన్నిహితంగా ఉన్నాం.. భారత్ నాపైనా, మా దేశంపైనా నూటికి నూరు శాతం ఆధారపడవచ్చు... అంటే తెలిపారు ట్రంప్. కాగా తమ అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను ఎంతో ఇష్టపడతాని, మోదీకి ఆయన ఫ్యాన్ అని తెలిపారు రూబియో.