Burning Topic: నెతన్యాహుకు ఎదురుగాలి.. సొంత ప్రజల నుంచే ద్వేషం!
Burning Topic: ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల సమాచారం కోసం [ఇజ్రాయెల్ నెెస్సెట్ అధికారిక వెబ్‌సైట్](https://main.knesset.gov.il) చూడవచ్చు.
Burning Topic: నెతన్యాహుకు ఎదురుగాలి.. సొంత ప్రజల నుంచే ద్వేషం!
Burning Topic: ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌కు ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ఇజ్రాయెల్ చూట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
2023 అక్టోబరు 7న హమాస్ జరిపిన దాడి తర్వాత పశ్చిమాసియాలో గాజా, లెబనాన్, ఇరాన్‌లతో ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధాల నేపథ్యంలో ఇజ్రాయెల్ భవితవ్యానికి ఈ ఎన్నికలు ఓ పరీక్షగా భావిస్తున్నారు. ప్రస్తుత ప్రధాన మంత్రి బెన్యామిన్ నెతన్యాహు ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్నారు.
అయితే తాజా అంచనాల ప్రకారం అధికార లికుడ్ పార్టీకి ఎన్నికల ఫలితాలు షాక్ కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెతన్యాహుకు మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐజన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష 'యషార్' పార్టీ నుండి గట్టి సవాలు ఎదురవుతోంది. ఈ సర్వేలో ప్రతిపక్ష యషార్ పార్టీ 25 స్థానాలు సాధిస్తుందని అంచనా వేయగా, నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ 21 స్థానాలకే పరిమితం కానుంది.
ఇజ్రాయెల్‌ను రక్షిస్తానంటూ యుద్ధాలను సమర్ధించే నెతన్యాహును ఇప్పుడు ఆ దేశ ప్రజలే తిరస్కరిస్తున్నట్లు తాజా సర్వేలో చెబుతోంది. మొత్తం 120 స్థానాలున్న నెస్సెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 స్థానాల మద్దతు అవసరం.
సర్వే ప్రకారం యషార్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అక్కడ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. యషార్, లికుడ్ పార్టీ మధ్య సీట్ల తేడా చాలా తక్కువ. యషార్ పార్టీ స్పష్టంగా 4 సీట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
నెతన్యాహు మద్దతుదారుల కూటమి 50 స్థానాలు, అరబ్ పార్టీలు రామ్ పార్టీ 6, హదాష్-తాల్ 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. నెతన్యాహు వ్యతిరేక పార్టీల కూటమి 'చేంజ్ బ్లాక్' 58 స్థానాలు సాధించే అవకాశం ఉంది, అంటే ఇది మెజారిటీకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలవనుంది.
విపక్ష నాయకులు బెన్నీ గాంట్జ్, యాయీర్ లాపిడ్ గట్టిపోటీ ఇస్తున్నారు. నెతన్యాహూ కూటమి అధికారం చేజిక్కించుకోవడం దాదాపు కష్టమే. ఎన్నికల తర్వాత 61 మంది అంతకంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు కూడగట్టిన నేత మాత్రమే ప్రధానమంత్రి అవుతారు.
అయితే నెతన్యాహు వ్యతిరేక కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. ప్రతిపక్ష కూటమిలో ఏ పార్టీకైతే ఎక్కువ సీట్లు వస్తాయో, ఆ పార్టీ నాయకుడికే ప్రధాని అయ్యే అవకాశం దక్కాలని అక్కడ పార్టీలు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రతిపక్షం నుండి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ష ‘యషార్’ పార్టీ అధినేత గాడి ఐజన్‌కోట్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సుదీర్ఘకాలంగా ప్రధానిగా ఉన్న నెతన్యాహు జాతీయ భద్రత, యుద్ధనిర్వహణ, తనపై ఉన్న న్యాయపరమైన కేసుల సవాళ్ల మధ్య ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
గత మూడేళ్లుగా పశ్చిమాసియాతో సాగిస్తున్న యుద్ధం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇజ్రాయెల్ ప్రజలు తమ దేశం యుద్ధం త్వరగా ముగించాంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. నెతన్యాహూ మాత్రం ఇందుకు విరుద్దంగా కాలుదువ్వడం సమస్యగా మారింది.
కాగా దేశ ప్రజల్లో తనపట్ట వ్యతిరేకతను తగ్గించుకోడానికి ఇజ్రాయెల్ ప్రధాని యుద్ధాలనే ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు. ఎన్నికల్లో అధికారాన్ని నిల్పుకోవడమే లక్ష్యంగా కొత్త రాజకీయ అస్త్రాన్ని బయటకు తీశారు.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్‌లో భారీ బిల్ బోర్డుల మీద ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, హెజ్‌బొల్లా చీఫ్ నయీమ్ ఖాసీమ్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కనిపించారు.
నెతన్యాహును ఓడించాలనుకునే వాళ్లను గెలవనివ్వొద్దు అంటూ లికుడ్ పార్టీ చేసిన ఈ ప్రచారం ఇప్పుడు ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఇజ్రాయెల్‌కు ముప్పుగా చూపించే ప్రయత్నంలో భాగంగానే నెతన్యాహూ ఈ ప్రచారం సాగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ తరహా ప్రచారం నెత్యాహూకు కలిసొస్తుందా, రాజకీయంగా నష్టం కలిగిస్తుందా అనేది తేలాల్సిన అవసరం ఉంది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని టార్గెట్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. మమ్దానీ మొదటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
నెతన్యాహు యుద్ధ నేరస్థుడు అంటూ అభివర్ణించిన మమ్దానీ.. ఆయనను హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తిగా వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను అమెరికా అధికారులు అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
మమ్దానీ వ్యాఖ్యలపై ప్రధాని నెతన్యాహు కూడా తీవ్రంగా స్పందించారు. న్యూయార్క్‌లో వివిధ మతాల ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మమ్దానీ వంటి ప్రగతిశీల నేతల ప్రభావంతో అమెరికా డెమోక్రాట్లలో ఇజ్రాయెల్‌కు మద్దతు తగ్గే అవకాశం ఉందని నెతన్యాహు హెచ్చరించారు.
మొత్తానికి ఇజ్రాయెల్ ఎన్నికల్లో కూడా మామ్దానీ ప్రచారాస్త్రం అయిపోయారు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బ్రిటన్ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ దేశాన్ని "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్" అభివర్ణించారు.
అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా యూకే మారబోతోందంటూ అభివర్ణించారు నెతన్యాహూ. 1967 యుద్ధ సమయంలో బ్రిటన్ మీడియా నుంచి ఇజ్రాయెల్‌కు లభించిన మద్దతును గుర్తుచేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌లో ఆ మద్దతును ఆశించలేమని అన్నారు.
బ్రిటన్‌లో శర వేగంగా పెరిగిపోతున్న ముస్లింల జనాభా కారణంగా అక్కడి రాజకీయాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. కొంత కాలంటా ఆ దేశం నుంచి ఇజ్రాయెల్‌కు తగిన మద్దతు లభించకపోవమే నెతన్యాహూ వ్యాఖ్యలకు కారణమని భావిస్తున్నారు.
కాగా నెతన్యాహు వ్యాఖ్యలను బ్రిటన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అయితే ఈ వ్యాఖ్యలు తనవి కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలని అంటున్నారు నెతన్యాహూ.