News Analysis: కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే: BRS నేత దత్తాత్రేయ

News Analysis: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీలకు మేకులు గుచ్చి దాడులు చేశారని హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో బిఆర్ఎస్ నేత దత్తాత్రేయ తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2026-07-23 07:46 GMT

News Analysis: కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే: BRS నేత దత్తాత్రేయ

News Analysis: నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై 'హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) న్యూస్ అనాలిసిస్' డిబేట్‌లో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దత్తాత్రేయ దిగ్భ్రాంతికర ఆరోపణలు చేశారు. న్యాయమైన డిమాండ్లతో వీధిలోకి వచ్చిన విద్యార్థులపై అత్యంత పాశవికంగా దాడులు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు, బిజెపి అనుబంధ వర్గాలు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారని దత్తాత్రేయ ఆరోపించారు. లాఠీలకు పదునైన మేకులు (మొలలు) గుచ్చి కొట్టడంతో ఒక్కో విద్యార్థి శరీరంపై 20 నుంచి 30 గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న మహిళా విద్యార్థులను సైతం బాత్‌రూమ్‌లలో భయాందోళనలకు గురిచేసి పంపించేశారని మండిపడ్డారు.

Full View

Tags:    

Similar News