Off The Record: రంగంలోకి బొత్స ఝాన్సీ..
Off The Record: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి మళ్లీ రాజకీయాల్లోకి యాక్టివ్ అయ్యారు.
Off The Record: రంగంలోకి బొత్స ఝాన్సీ..
Off The Record: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ చక్రం తిప్పుతున్న బొత్స సత్యనారాయణ.. ఫ్యామిలీ మార్క్ పాలిటిక్స్‌కి మరోసారి స్కెచ్ వేస్తున్నారు. తాజాగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీతో.. పాలిటిక్స్‌లో రీ ఎంట్రీ ఇప్పించేశారు. గత ఎన్నిల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి శ్రీభారత్ చేతిలో ఓటమి పాలయ్యారు ఝాన్సీ. అప్పటి నుంచి ఝాన్సీ విశాఖ ముఖం చూడనేలేదు. ఎన్నికల సమయంలో మాత్రం నేను పుట్టింది విశాఖలో.. నా పుట్టినిల్లు వైజాగ్ అంటూ ప్రజల్లో సెంటిమెంట్ పండించినా.. అదంతగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఘోర పరాజయం పొందారు. ఇక తన అడ్రస్ విశాఖనే అని చెప్పిన ఆమె.. ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి దాదాపూ రెండేళ్ల తర్వాత సడెన్‌గా విశాఖలో రాజకీయ కార్యక్రమల్లో మెరుస్తున్నారు ఝాన్సీ. దీంతో ఇప్పుడు బొత్స ఫ్యామిలీ హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకి ఝాన్సీ ఎంట్రీ వెనుక వ్యూహం ఏంటన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లోల మొదలైంది.
ఉత్తరాంధ్రలో ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ చేయడంలో బొత్స సత్యనారాయణ దిట్ట. ఆ నెర్పరితనంతోనే విజయనగరం జిల్లాలో కుటుంబపాలన చేశారు. అయితే అనుకోకుండా ప్రస్తుతం విశాఖకు షిఫ్ట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేసినా గెలవలేకపోయారు. ఇదే అనుభవంతో అనేక అంచనాలు వేస్తూ బొత్స మైండ్ గేమ్ స్టార్ట్ చేశారనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఒకవేళ మహిళా రిజర్వేషన్ అమలనా ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచి లెక్కలు వేస్తూ ఒక పక్క భార్య ఝాన్సీని యాక్టివ్ చేస్తున్నారట సత్తిబాబు. మరోపక్క చిన్న సీనునీ భీమిలి బరిలోకి దింపారు. 33 శాతం రిజర్వేషన్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఇప్పటికే చిన్న సీను కూతురు సిరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ కూతురు అనూష కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే టాక్ రీసౌండ్ చేస్తోంది. దీంతో బొత్స వైజాగ్‌లో తన మార్క్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారన్న గుసగుసలు బలంగానే వినిపిస్తున్నాయి. మరోవైపు కాపు కార్డు కూడా వాడుకుంటూ అటు సామాజిక సమీకరణలు చేస్తూ ముందుకు వెళుతున్నారట బొత్స సత్యనారాయాణ.
అందులో భాగంగా బొత్స ఝాన్సీ బాగా యాక్టివ్ అయ్యారన్న చర్చ జోరందుకుంది. గత ఎన్నికల తర్వాత ఆమె రాజకీయంగా బయటకి రాలేదు. గతంలో వైసీపీ చేపట్టిన మెడికల్ క్యాంపు ఇష్యూ, రైతు సదస్సులు, పెట్రోల్ రేట్ల నిరసనల్లో కనపడలేదు. కానీ.. ఈమధ్య ఉత్తరాంధ్రలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. విజయనగరంలోని స్థానిక ఆలయాలను, ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తూ కేడర్‌తో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ఆమె భర్త, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆయన అండతో ఝాన్సీ లక్ష్మి క్షేత్రస్థాయిలో కేడర్‌ను ఏకం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉత్తరాంధ్రలో వైసీపీ నిలదొక్కుకునేందుకు బలమైన నేతల అవసరం ఏర్పడింది. బొత్స కుటుంబం తమ పాత కేడర్‌ను తిరిగి యాక్టివేట్ చేస్తూ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై కూడా దృష్టి పెట్టారు.
తాజాగా తాడేపల్లి మీటింగ్ తర్వాత ఝాన్సీ రెండేళ్ల పాలనకు గొడ్డలిపోటు కార్యక్రమాల్లో దూకుడుగా పాల్గొంటున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో పరామర్శకి వచ్చిన వైఎస్ జగన్ వెంట కలియతిరిగారు. ఇలా మళ్ళీ వైసీపీ కార్యక్రమాలకు రావడం, భర్త బొత్సతోపాటు చురుకుగా తిరగడంతో మరోసారి ఝాన్సీ రాజకీయ భవితపై టాక్స్ మొదలయ్యాయి. అయితే మళ్ళీ విశాఖ నుంచి పోటీ చేస్తారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి విశాఖ ఎంపీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. దీంతో జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా బొత్స అన్నీ తానే అన్నట్లు నడిపిస్తున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి నడిపిస్తున్నారు. ఇలా భవిష్యత్తు ప్రణాళికలో భాగంగానే బొత్స ఝాన్సీ వైజాగ్ వైపు చూస్తున్నారనే విషయం ప్రచారంలో ఉంది. రాజకీయాలతోపాటు ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వం పొంది లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేస్తుండటం ఆమెకు అదనపు బలంగా మారింది. బొత్స ఝాన్సీ లక్ష్మి కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కాకుండా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎంపీ స్థానం నుంచే బరిలోకి దిగే లక్ష్యంతో ముందస్తుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తరాంధ్రలో సామాజిక సమీకరణాలు, బొత్స కుటుంబానికి ఉన్న పట్టు ఆధారంగా ఆమె రీ-ఎంట్రీ వచ్చే రోజుల్లో మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా బొత్స పొలిటికల్ స్ట్రాటజీ మాత్రం అదుర్స్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సత్తిబాబు వ్యూహలు ఏమేరకు ఫలితస్తాయో చూడాలి మరి.