Off The Record: కేటీఆర్, హరీష్ రావు కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి
Off The Record: సింగరేణిలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు.
Off The Record: కేటీఆర్, హరీష్ రావు కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి
Off The Record: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచిర్యాలలో ఇటీవల రెండు రోజులపాటు పర్యటించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ సందర్శించడమే కాకుండా.. బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, రవాణాపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. అధికారులను పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుని మరీ మీడియా సమక్షంలో ప్రత్యేక "ఓపెన్ హౌస్ ఇన్‌స్పెక్షన్" ఏర్పాటు చేశారు. ఓపెన్‌కాస్టు బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, రవాణా వ్యవస్థపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సింగరేణిలో బొగ్గు ఎలా తవ్వుతున్నారు..? గనిలో నుంచి వెలికితీసిన బొగ్గు ఏ మార్గంలో విద్యుత్ కేంద్రాలకు చేరుతోంది..? బొగ్గు రవాణాలో ఎలాంటి ఆధునిక సాంకేతికత వినియోగిస్తున్నారు..? రవాణాపై నిఘా ఎలా పనిచేస్తోంది..? సింగరేణిపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేలా పిన్ టు పిన్ భట్టి డిటైల్డ్ స్టడీ చేశారు.
స్వయంగా సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతితోపాటు ఆయా విభాగాలకు చెందిన డైరెక్టర్లు అందరూ... బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించి అన్ని ఆధునిక సాంకేతికతతో, పకడ్బందీ నిఘా వ్యవస్థ మధ్యలో జరుగుతున్న తీరును డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు. అన్ని విషయాలూ తెలుసుకున్న భట్టి.. ప్రతిపక్షాలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా హరీష్‌రావు, కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికుల చెమటచుక్కలను అవమానిస్తున్నారంటూ దుయ్యబట్టారు. కార్మికుల శ్రమ, ఆత్మగౌరవాన్ని ప్రశ్నించేలా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం రంగంలోకి దిగడంతో ఒక రకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టినట్లయ్యింది. మరీ ముఖ్యంగా, సింగరేణిలో బొగ్గు మాటున వేల కోట్ల అవినీతి సాధ్యం కాదని, ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయని భట్టి చెప్పగలిగారు. బీఆర్ఎస్ కార్మికుల్లో సృష్టించిన గందరగోళాన్ని ఆయన ఎట్టకేలకు తుడిచివేయగలిగారు. కానీ త్వరలో సింగరేణి ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా, డిప్యూటీ సీఎం రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చారు. దీనికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.