Big Issue: భారత్ చేతికి మరో పవర్‌ఫుల్ అస్త్రం.. శత్రువులకు ఇక చుక్కలే!
Big Issue: భారత రక్షణ వ్యవస్థకు మరో పవర్‌ఫుల్ అస్త్రం చేరింది. అదే స్వదేశీ సాంకేతికతతో తయారైన 'భార్గవాస్త్ర'.
Big Issue: భారత రక్షణ రంగం ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అద్భుతమైన మైలురాయిని సాధించింది. శత్రు దేశాలు ప్రయోగించే డ్రోన్ల బారి నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక 'భార్గవాస్త్ర' కౌంటర్ డ్రోన్ వ్యవస్థను రూపొందించారు. ఇటీవల ఒడిశాలోని గోపాల్‌పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ అస్త్రం విజయం సాధించింది.
శత్రు దేశాలు ప్రయోగించే డ్రోన్‌లను 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి, అవి తమ లక్ష్యాన్ని చేరుకోకముందే గాల్లోనే ధ్వంసం చేసే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. ఈ అస్త్రం గాల్లోనే శత్రు డ్రోన్‌ల దారిని కనిపెట్టి వాటిని వెంటాడి మరీ నాశనం చేస్తుంది. ఇది ఎయిర్ (Air), సీ (Sea), మరియు ల్యాండ్ (Land) – మూడు వేదికలపై సమాన ఖచ్చితత్వంతో పనిచేస్తుంది.