Tiruchanur: తిరుచానూరు సర్పంచ్‌గా వడ్రాయన మునెమ్మ ఏకగ్రీవ ఎన్నిక!
Tiruchanur: తిరుపతి రూరల్ తిరుచానూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి వడ్రాయన మునెమ్మ మొట్టమొదటిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Tiruchanur: తిరుచానూరు సర్పంచ్‌గా వడ్రాయన మునెమ్మ ఏకగ్రీవ ఎన్నిక!
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వడ్రాయన మునెమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మునెమ్మ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుచానూరు క్లస్టర్ మధు శేఖర్, అల్మినేని మధు, తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ రావ్విళ్ల సురేంద్ర నాయుడు, దామా సాయి రాయల్, హరి రామ్ రెడ్డి, వాసు, డిస్కో శివ, శ్రీధర్ రెడ్డి, ఎంపిటిసి లు కాళహస్తి సుభాషిని, శంకర్ రెడ్డి, ఎలిజిబెత్, రేఖ, యశోద, దామినేడు రమేష్, మార్కండేయ, అరుణాచలం, సల్మాన్ రాజు, జీవన్ కుమార్, ఖలీమ్, మురళి, నాగరాజు కూటమి కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.