Srikalahasti: శ్రీకాళహస్తి శివకుమార్ కేసు ఛేదన నలుగురు నిందితుల అరెస్ట్!
Srikalahasti: స్వర్ణముఖి నది కట్టపై జరిగిన శివకుమార్ హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Srikalahasti: శ్రీకాళహస్తి శివకుమార్ కేసు ఛేదన నలుగురు నిందితుల అరెస్ట్!
Srikalahasti: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించి విశ్లేషించారు. దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేషన్ కార్తీక్, వేలు గోపీనాథ్ అలియాస్ గుండు గోపి, బి. శ్రీధర్ అలియాస్ రెడ్డి, అలాగే పుత్తూరుకు చెందిన మునస్వామి సూర్య ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితులపై తమిళనాడు రాష్ట్రంలో గతంలోనే పలు కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో ఒకరిపై 25 పాత కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన మోటార్‌సైకిల్, రెండు కత్తులు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇంకా ఒక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నేరచరిత్ర కలిగిన నిందితులపై PD Act నమోదు చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును సాంకేతిక ఆధారాలతో వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు.