Renigunta: రేణిగుంటలో ఎస్ఐఆర్-2026 వినతుల పరిశీలన కలెక్టర్
Renigunta: రేణిగుంట మండలం మామండూరులో ఎస్ఐఆర్-2026 ఓటరు జాబితా వినతుల పరిశీలనను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్.
Renigunta: రేణిగుంటలో ఎస్ఐఆర్-2026 వినతుల పరిశీలన కలెక్టర్
రేణిగుంట: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026లో భాగంగా ఓటరు జాబితాపై వచ్చిన వినతులు, అభ్యంతరాల విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ బుధవారం రేణిగుంట మండలం మామండూరు గ్రామపంచాయతీలో ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా విచారణకు హాజరైన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పు, మ్యాపింగ్ సమస్యలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించాలని సూచించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో చోటు కోల్పోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.