Tirupati: ఏఐతో వ్యాపార విప్లవం.. సుస్థిరతతోనే భవిష్యత్తు!
Tirupati: తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ‘సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్’పై నాలుగో అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.
Tirupati: ఏఐతో వ్యాపార విప్లవం.. సుస్థిరతతోనే భవిష్యత్తు!
తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 'సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్'పై నాలుగో అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు 'ఏఐ, సుస్థిరత, డిజిటల్ పరివర్తనతో వ్యాపార వ్యవస్థల పునర్నిర్వచనం' అనే థీమ్‌ను ఎంపిక చేశారు.
ప్రారంభోత్సవానికి నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మరియు మిడ్-వెస్ట్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ధృబ కుమార్ గౌతమ్, ఐఐఎం తిరుచ్చి సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ నిత్యానందం, ఆక్టోపి హెల్త్ సీఈఓ లోకేష్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ఏఐ, సుస్థిర ఆవిష్కరణల ప్రాధాన్యతను వివరించారు.
సదస్సులో భాగంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఏఐ ఆధారిత వ్యాపార రంగంలో ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, నైతిక నాయకత్వంపై ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యాపార సంస్థలు స్వల్పకాలిక లాభాలకే పరిమితం కాకుండా సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.