Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో ఇప్పటికి చేసింది 72 శాతమే: మంత్రి ఆనం!

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు.. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గురైన అన్నదాన పోటును పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో గత రెండున్నర ఏళ్ల కాలంలో ఎన్నో కార్యక్రమాలు భక్తుల కోసం సౌకర్యాలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటిదాకా తాము అనుకున్న దానిలో 72% మాత్రమే చేశామని అన్నారు.

ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ప్రభుత్వానికి ఉందని తప్పకుండా త్వరలో 100% భక్తులకు సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని కోడ్ ముగియగానే తనతోపాటు మంత్రులు ఉన్నతాధికారులు శ్రీకాళహస్తి ఆలయాన్ని పరిశీలించి ఉన్నత సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. భక్తుల సేవే లక్ష్యంగా కార్యచరణ చేపడతామని తెలిపారు.

Tags: