Renigunta: కట్ట పూట్టాలమ్మను దర్శించుకున్న సర్పంచ్ అభ్యర్థి పాడి రాజేంద్ర!

రేణిగుంట: రేణిగుంట మండల పరిధిలోని కరకంబాడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పాడి రాజేంద్ర నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ కట్ట పూట్టాలమ్మ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. అమ్మవారి కృపతో ఎన్నికల్లో విజయం సాధించి, గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కరకంబాడి పంచాయతీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని రాజేంద్ర అన్నారు.

Tags: