Srikalahasti: మున్సిపల్ కూటమి చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి!
Srikalahasti: శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో కూటమి చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి పేరును తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది.
Srikalahasti: మున్సిపల్ కూటమి చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి!
Srikalahasti: శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో కూటమి చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కూటమి తరఫున చైర్మన్ అభ్యర్థిగా బాలాజీ రెడ్డి పేరును ఖరారు చేయడంతో శ్రీకాళహస్తి రాజకీయాల్లో ఎన్నికల వేడి మరింత పెరిగింది.
పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.