Tirupati: తిరుపతిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం: భారీ ఆస్తి నష్టం!
Tirupati: తిరుపతి ఆర్సీ రోడ్డులో కలశం బిల్డింగ్ సమీపంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
Tirupati: తిరుపతిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం: భారీ ఆస్తి నష్టం!
తిరుపతి: నగరంలోని ఆర్ సి రోడ్డులో కలశం బిల్డింగ్ సమీపంలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.గ్యాస్ గోడౌన్ ఎదురుగా ఉన్న ఈ భవనం కూలిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
నూతన భవన నిర్మాణం కోసం పక్కనే గుంత తవ్వుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. భవనం కూలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
భవనం కూలిన సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా పరిశీలన చేపట్టారు.భవనం కూలిపోవడానికి గల పూర్తి కారణాలు,నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. భవనం కూలిన ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.