Chandragiri: తిరుమల నగర్‌లో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 50 మంది
Chandragiri: తిరుపతి రూరల్ తిరుమల నగర్ పంచాయతీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరిన 50 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు; తుడా చైర్మన్ హాజరు.
Chandragiri: తిరుమల నగర్‌లో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 50 మంది
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీకి చెందిన సుమారు 50 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సాధించిన విజయాలతో తెలుగుదేశం పార్టీలో మరింత జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుమల నగర్ పంచాయతీలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
రానున్న పంచాయతీ ఎన్నికల్లో తిరుమల నగర్ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.