Renigunta: రేణిగుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన బొజ్జల రిషిత రెడ్డి!

Renigunta: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Update: 2026-08-18 12:54 GMT

Renigunta: రేణిగుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన బొజ్జల రిషిత రెడ్డి!

రేణిగుంట: రేణిగుంట పట్టణంలోని శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవం కన్నులపండువగా సాగింది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి మంగళవారం అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న బొజ్జల రిషిత రెడ్డి కి ఆలయ కమిటీ చైర్మన్ సోలా మల్లికార్జున్ రెడ్డి,టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, స్థానిక నాయకులు మరియు కమిటీ సభ్యులు బ్యాండ్ మేళాలు, మంగళవాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆమె అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను బహూకరించారు.ఈ వేడుకల్లో కూటమి కుటుంబ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

Tags:    

Similar News