Renigunta: మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీలో ఘనంగా ఓరియంటేషన్
Renigunta: రేణిగుంట సమీపంలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఓరియంటేషన్ కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఛాన్సలర్ మహేందర్ రెడ్డి, పలువురు ప్రముఖులు.
Renigunta: మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీలో ఘనంగా ఓరియంటేషన్
రేణిగుంట: రేణిగుంట మండలం మల్లవరం గ్రామం సమీపంలో నూతనంగా నిర్మించిన మల్లారెడ్డి (ఎంఆర్) డీమ్డ్ యూనివర్సిటీలో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఫౌండర్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, యూనివర్సిటీ ఛాన్సలర్ మహేందర్‌రెడ్డి, ఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ భద్రారెడ్డి పాల్గొని ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, విద్యా అవకాశాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై అవగాహన కల్పించారు.నూతన విద్యార్థులకు నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.