Heavy Rain Alert: తెలంగాణకు 'అత్యంత భారీ' వర్ష సూచన.. 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్..!

Heavy Rain Alert: తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Update: 2026-07-30 06:51 GMT

Heavy Rain Alert: తెలంగాణకు 'అత్యంత భారీ' వర్ష సూచన.. 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్..!

Heavy Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ సహా పలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాల తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా ఐఎండీ జిల్లాలవారీగా కలర్ కోడెడ్ అలెర్ట్‌లను ప్రకటించింది. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ మరియు జగిత్యాల జిల్లాలకు 'రెడ్ అలెర్ట్' జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున స్థానిక యంత్రాంగం మరియు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలోని మరో 19 జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌తో పాటు మరో 18 జిల్లాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్నందున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు, ఇతర జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగి ముందస్తు చర్యలు చేపట్టారు.

వర్షాల దాటికి వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరించారు.

Tags:    

Similar News