Damodar Raja Narasimha: నిమ్స్‌లో ఆపరేషన్ల వెయిటింగ్‌కు చెక్.. మంత్రి కీలక నిర్ణయం
Damodar Raja Narasimha: హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో సర్జరీల కోసం వేచి చూస్తున్న రోగులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ఊరటనిచ్చారు.
Damodar Raja Narasimha: నిమ్స్‌లో ఆపరేషన్ల వెయిటింగ్‌కు చెక్.. మంత్రి కీలక నిర్ణయం
Damodar Raja Narasimha: హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో సర్జరీల కోసం వేచి చూస్తున్న రోగులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ఊరటనిచ్చారు. నిమ్స్‌లో ఆపరేషన్ థియేటర్ల కొరత కారణంగా శస్త్రచికిత్సల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, వెయిటింగ్లో ఉన్న పేషెంట్లకు సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సమయపాలనతో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఇందులో భాగంగా నిమ్స్ విభాగాధిపతులు (HODs) అందరూ వెంటనే సనత్‌నగర్ టిమ్స్‌ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించాలని ఆదేశించారు. సర్జరీలకు అవసరమైన అదనపు వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు అవసరమైన డాక్టర్ల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త డాక్టర్ల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు, నిమ్స్ వైద్యులే సనత్‌నగర్ టిమ్స్‌లో తమ సేవలను కొనసాగిస్తూ రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో నిమ్స్‌లో సర్జరీల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న పేద, మధ్యతరగతి రోగులకు త్వరలోనే ఉపశమనం కలగనుంది.