Telangana Cabinet Expansion: కొండా సురేఖ బర్తరఫ్‌తో కేబినెట్ రేసు షురూ.. మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ!
Telangana Cabinet Expansion: కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత తెలంగాణ కేబినెట్ రేసులో తెరపైకి వచ్చిన బీసీ, ఎస్టీ ఎమ్మెల్యేలు.
Telangana Cabinet Expansion: కొండా సురేఖ బర్తరఫ్‌తో కేబినెట్ రేసు షురూ.. మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ!
Telangana Cabinet Expansion: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో కేబినెట్‌లో ఖాళీ అయిన మంత్రి పదవి భర్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ అనంతరం ప్రభుత్వంలో తదుపరి సమీకరణాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పలువురు బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభుత్వంలో విప్లుగా కొనసాగుతున్న బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పేర్లు మంత్రి పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. గొల్ల కురుమ సంఘం నుంచి బీర్ల ఐలయ్య, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మంత్రి పదవిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్ లేదా బాలు నాయక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం సామాజిక సమీకరణాలను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.