IAS Officers Transfer: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియమితులవగా, రాహుల్ బొజ్జా, శైలజా రామయ్యర్‌లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IAS Officers Transfer: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
IAS Officers Transfer: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పరంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీల్లో పలువురు సీనియర్ అధికారులకు అత్యంత కీలకమైన శాఖల బాధ్యతలను అప్పగించారు.
ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్ నియమితులయ్యారు. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. దీనితో పాటు ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ నియమితులయ్యారు. ఆమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేయడంలో భాగంగానే ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.