Thomson QLED TV : ఇంట్లోనే సినిమా థియేటర్.. రూ. 11 వేలకే అద్భుతమైన ఫీచర్లతో థామ్సన్ కొత్త QLED టీవీ.!

Thomson QLED TV : భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్లో బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించే బ్రాండ్‌గా థామ్సన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2026-05-08 07:58 GMT

Thomson QLED TV

Thomson QLED TV : భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్లో బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించే బ్రాండ్‌గా థామ్సన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సంస్థ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా మరో సరికొత్త క్యూలెడ్ (QLED) స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ. 10,999 ప్రారంభ ధరతో విడుదలైన ఈ టీవీలు, ఇంటినే ఒక మినీ థియేటర్‌లా మార్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గతంలో రూ. 5,999 వంటి అతి తక్కువ ధరకే టీవీలను అందించిన థామ్సన్, ఇప్పుడు క్వాంటం ఎల్ఈడీ టెక్నాలజీని బడ్జెట్ ధరలోకి తీసుకురావడం విశేషం.

అందుబాటు ధరల్లో అదిరిపోయే మోడల్స్

భారత్‌లో ఎస్‌పీపీఎల్ (SPPL) సంస్థ ద్వారా తయారవుతున్న ఈ థామ్సన్ స్మార్ట్ టీవీలు ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ప్రత్యేకంగా లభిస్తాయి. ఈ కొత్త సిరీస్‌ను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మూడు వేర్వేరు స్క్రీన్ సైజుల్లో అందుబాటులోకి తెచ్చారు. బేసిక్ మోడల్ అయిన 32 అంగుళాల టీవీ ధర రూ. 10,999 కాగా, మధ్యస్థంగా ఉండే 40 అంగుళాల మోడల్ ధర రూ. 15,999 గా నిర్ణయించారు. ఇక పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారి కోసం 43 అంగుళాల మోడల్‌ను రూ. 16,999 ధరతో విక్రయిస్తున్నారు. అదనంగా ఎస్‌బీఐ (SBI) కార్డ్ వినియోగదారులకు 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుండటంతో, ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

లెటేస్ట్ టెక్నాలజీ..

సాంకేతిక విషయానికి వస్తే, ఈ కొత్త థామ్సన్ సిరీస్ లేటెస్ట్ 'గూగుల్ టీవీ 5.0' ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనివల్ల వినియోగదారులకు చాలా సులభమైన , పర్సనలైజ్డ్ ఇంటర్‌ఫేస్ లభిస్తుంది. 350 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్‌ప్లే మెరుగైన దృశ్య అనుభూతిని ఇస్తుంది. సినిమాటిక్ ఆడియో కోసం ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్‌ను అందించారు. యూజర్ల సౌకర్యార్థం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో , యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ కోసం రిమోట్‌లోనే ప్రత్యేక బటన్లను పొందుపరిచారు. బ్లూటూత్ రిమోట్ ద్వారా టీవీని ఆపరేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది.

కనెక్టివిటీ.. పెర్ఫార్మెన్స్

ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ ప్లే స్టోర్ అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు సుమారు 10,000కు పైగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో శక్తివంతమైన ఏఆర్ఎమ్ (ARM) కార్టెక్స్ A55 క్వాడ్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి తోడు 1GB ర్యామ్ , 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను జత చేశారు. కనెక్టివిటీ పరంగా మూడు హెచ్‌డీఎమ్ఐ (HDMI) పోర్టులు, రెండు యూఎస్‌బీ (USB) పోర్టులతో పాటు వైఫై, బ్లూటూత్, ల్యాన్ (LAN) , ఇన్-బిల్ట్ గూగుల్ క్రోమ్‌కాస్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ థామ్సన్ క్యూలెడ్ టీవీలు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తాయి.


Tags:    

Similar News