POCO X8 5G.. 9,000mAh బ్యాటరీతో బిగ్ సర్‌ప్రైజ్..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో గ్లోబల్ మార్కెట్‌లో తమ లేటెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్ 'పోకో ఎక్స్‌8 5జి'ని అధికారికంగా ఆవిష్కరించింది. బయటి..

Update: 2026-09-02 07:04 GMT

POCO X8 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో గ్లోబల్ మార్కెట్‌లో తమ లేటెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్ 'పోకో ఎక్స్‌8 5జి'ని అధికారికంగా ఆవిష్కరించింది. బయటి మార్కెట్లలో ఇప్పటికే గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ పవర్‌ఫుల్ ఫోన్, భారతీయ టెక్ ప్రియులను అలరించేందుకు సెప్టెంబర్ 4న ఇండియాలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. హై-రిఫ్రెష్ రేట్ ఆమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ ప్రాసెసింగ్ పవర్ , అత్యంత పటిష్టమైన డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ రేటింగ్‌లతో ఈ డివైజ్ మార్కెట్‌లోకి రాబోతోంది.

ధర , వేరియంట్ల వివరాలు

గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎక్స్‌8 5జి స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా మూడు మెమరీ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ప్రారంభ వేరియంట్ ధర $269 (సుమారు రూ. 25,500)గా నిర్ణయించగా, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర $299 (సుమారు రూ. 28,400)గా ఉంది. ఇక హై-ఎండ్ మోడల్ అయిన 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర $349 (సుమారు రూ. 33,100)గా కంపెనీ లాక్ చేసింది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఈ ఫోన్ బ్లాక్, ఆరెంజ్ , వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

డిస్‌ప్లే అండ్ ప్రాసెసింగ్ పెర్ఫార్మెన్స్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.83-ఇంచ్ 1.5K ఆమోలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ , HDR10+ సపోర్ట్‌తో అత్యంత స్పష్టమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. స్క్రీన్ భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీపడకుండా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 చిప్‌సెట్‌ను వాడారు. ఇది LPDDR4X ర్యామ్ , UFS 3.1 ఫాస్ట్ స్టోరేజ్‌తో కలిసి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఎంతో స్మూత్‌గా రన్ అవుతుంది.

కెమెరా సెటప్ అండ్ సరికొత్త ఏఐ ఫీచర్లు

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో OIS , EIS సపోర్ట్ ఉన్న 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. సాధారణ ఫోటోగ్రఫీతో పాటు అండర్‌వాటర్ షూటింగ్, డ్యూయల్ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఫొటోలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు గ్లేర్ రిమూవల్, ఎరేజ్ ప్రో, ఇమేజ్ ఎక్స్‌పాన్షన్ వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ (AI) టూల్స్‌ను కంపెనీ ఇందులో ఇన్-బిల్ట్‌గా అందించింది.

వాటర్ ప్రొటెక్షన్ అండ్ మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ

ఈ ఫోన్ మెయిన్ హైలైట్ దీని డ్యూరబిలిటీ , బ్యాటరీ కెపాసిటీ అనే చెప్పాలి. నీరు , దుమ్ము నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ కోసం ఏకంగా IP66, IP68, IP69 , IP69K రేటింగ్‌లు ఇచ్చారు. ఇది అత్యధిక వేడి , తీవ్రమైన వాటర్ ప్రెజర్‌ను కూడా తట్టుకోగలదు. గ్లోబల్ వేరియంట్‌లో 8,340mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించగా, ఇది 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ , 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 1,600 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా బ్యాటరీ 80 శాతం హెల్త్‌ను నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది. అయితే సెప్టెంబర్ 4న రాబోయే ఇండియన్ మోడల్‌లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీ ఉండబోతుండటం విశేషం.

Tags:    

Similar News