WhatsApp Bill Payments: వాట్సాప్‌లో కొత్తగా బిల్ పేమెంట్స్ సేవలు ప్రారంభం!
WhatsApp Bill Payments: మెటాలో కునాల్ షా చేరికతో వాట్సాప్‌లో బిల్ పేమెంట్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత్ కనెక్ట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
WhatsApp Bill Payments: వాట్సాప్‌లో కొత్తగా బిల్ పేమెంట్స్ సేవలు ప్రారంభం!
WhatsApp Bill Payments: ఫెయిమస్ ఫిన్‌టెక్ సంస్థ 'క్రెడ్' (CRED) వ్యవస్థాపకుడు కునాల్ షా వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా మెటాలో బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే, ఈ ప్రముఖ మెసేజింగ్ వేదిక వినియోగదారుల కోసం కీలక సేవను ప్రారంభించింది. భారతదేశంలో తన ఆర్థిక సేవలను విస్తరిస్తూ వాట్సాప్‌లో కొత్తగా 'బిల్ పేమెంట్స్' (Bill Payments) సేవలను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. రాబోయే వారాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో లభించనుంది.
ఈ నూతన ఫీచర్ భారత్ కనెక్ట్ (BBPS) నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుందని, దీని ద్వారా విద్యుత్, గ్యాస్, నీరు, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు మరియు ఈఎంఐ చెల్లింపులతో సహా దాదాపు 30 విభాగాల్లోని 22,,722 బిల్లుదారులకు సులభంగా పేమెంట్స్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. వినియోగదారులు వాట్సాప్ హోమ్ స్క్రీన్ పైభాగంలో ఉన్న రూపాయి (₹) ఐకాన్‌పై ట్యాప్ చేసి ఈ సేవలను పొందవచ్చు. దీని ద్వారా యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి పెండింగ్ బిల్లులను చెల్లించడమే కాకుండా, రాబోయే చెల్లింపుల వివరాలను కూడా సులభంగా తనిఖీ చేయవచ్చు.
భారతీయులు యాప్ నుండి బయటకు వెళ్లకుండానే దైనందిన పనులు మరియు చెల్లింపులు పూర్తి చేసుకోవడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని మెటా ఇండియా కంట్రీ హెడ్ అరుణ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాగా, జూన్ 2026లో వాట్సాప్ పే ఏకంగా 15 కోట్ల లావాదేవీలను నమోదు చేసి, డిజిటల్ చెల్లింపుల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది.