Jio Plan: అలాంటి వారి కోసం జియో సంచలన ప్లాన్.. కేవలం రూ. 189 రూపాయలకే..!

Jio Cheapest Recharge Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం నిశ్శబ్దంగా ఒక అద్భుతమైన చౌక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Update: 2026-05-16 04:21 GMT

Jio Plan: అలాంటి వారి కోసం జియో సంచలన ప్లాన్.. కేవలం రూ. 189 రూపాయలకే..!

Jio Cheapest Recharge Plan: భారతదేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ అయిన రిలయన్స్ జియో, ఎల్లప్పుడూ తన వినియోగదారుల బడ్జెట్‌కు అనుగుణంగా సరికొత్త ప్లాన్‌లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో నంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారి కోసం 189 రూపాయల చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండి ఇంటర్నెట్ చాలా తక్కువగా వాడేవారికి, రెండవ సిమ్ కార్డును యాక్టివ్‌దగా ఉంచుకునే వారికి ఇది అత్యంత లాభదాయకమైన ఎంపిక.

లభించే ప్రయోజనాలు, వాలిడిటీ..

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు పూర్తి 28 రోజుల కాలపరిమితి లభిస్తుంది. దీనితో పాటు భారతదేశంలో ఎక్కడికైనా ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. స్థానిక లేదా ఇతర రాష్ట్రాల కాల్స్‌కు ఎటువంటి అదనపు రుసుము ఉండదు. అంతేకాకుండా, జాతీయ రోమింగ్ కూడా ఉచితం. ఈ ప్లాన్‌లో మొత్తం 28 రోజులకు కలిపి 300 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి.

డేటా పరిమితి, అదనపు ప్రయోజనాలు..

ఇంటర్నెట్ అవసరాల కోసం ఇందులో మొత్తం 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి రోజువారీ పరిమితి ఏమీ లేదు. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి ఈ డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంత తక్కువ ధరలో కూడా జియో కంపెనీ ఉచితంగా లైవ్ టీవీ ఛానెళ్లు చూసేందుకు జియో టీవీ, ఫోటోలు, ఫైల్స్ భద్రపరుచుకోవడానికి జియో క్లౌడ్ వంటి డిజిటల్ సేవలను ఉచితంగా అందిస్తోంది.

రెండవ సిమ్ కార్డు వినియోగదారులకు బ్రహ్మాస్త్రం..

చాలా మంది బ్యాంకింగ్ అవసరాల కోసం, ఆఫీసు పనుల కోసం లేదా ఓటిపిల కోసం రెండవ సిమ్ కార్డును ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు కేవలం నంబర్ సక్రియంగా ఉంచుకోవడానికి భారీ మొత్తంలో రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ ద్వారా రోజువారీ ఖర్చు కేవలం 7 రూపాయల కంటే తక్కువగానే పడుతుంది. ఇది వృద్ధులకు, కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడే వారికి కూడా ఎంతో అనుకూలమైనది. ఒకవేళ ప్రతిరోజూ ఎక్కువ డేటా కావాలనుకునే వారి కోసం జియో వద్ద 199 రూపాయల ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో రోజుకు 1.5GB డేటా లభిస్తుంది.

Tags:    

Similar News