Kanchili: కంచిలి మండలంలో కన్నీటి ఘటన.. అండగా నిలిచిన గుడియా సంఘం!

Kanchili: సంతానం లేకపోవడంతో అనారోగ్యంతో మృతి చెందిన భర్త గుడియా జ్ఞానికి ఆయన భార్య కంటనీటితో తలకొరివి పెట్టి కడసారి బాధ్యత నిర్వర్తించింది.

Update: 2026-08-12 16:12 GMT

Kanchili: కంచిలి మండలంలో కన్నీటి ఘటన.. అండగా నిలిచిన గుడియా సంఘం!

కంచిలి: కంచిలి మండలం పద్మతుల గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన గుడియా జ్ఞాని బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. జీవితాంతం కష్టపడి బతికిన ఆయనకు సంతానం లేదు. ఆయన మరణవార్త తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. కొడుకులు లేని ఆ ఇంట్లో భారమంతా భార్యపైనే పడింది. కంట నీరు పెట్టుకుంటూనే ఆమె భర్తకు తలకొరివి పెట్టి కడసారి బాధ్యత నిర్వర్తించింది. ఈ కార్యక్రమంలో గుడియా సంఘం సభ్యులు పాల్గొని అన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలు లేకపోయినా, సంఘం అండగా ఉండటంతో అంత్యక్రియలు గౌరవంగా జరిగాయి. గుడియా సంఘ పెద్దలు, గ్రామస్తులు కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం చెప్పారు.

Tags:    

Similar News