Sompeta: ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ: పాల్గొన్న విద్యార్థులు, అధికారులు!

Sompeta: సోంపేటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ. జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, అధికారుల భాగస్వామ్యం.

Update: 2026-08-13 16:35 GMT

Sompeta: ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ: పాల్గొన్న విద్యార్థులు, అధికారులు!

సోంపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం "హర్ ఘర్ తిరంగా" ర్యాలీ కార్యక్రమాన్ని సోంపేటలో నిర్వహించారు. సోంపేట జూనియర్ కళాశాల ఆవరణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ రోడ్డు వరకు సాగింది.

విద్యార్థులు, అధ్యాపకులు చేతిలో భారత జాతీయ జెండాను పట్టుకొని "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" నినాదాలతో ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... దేశభక్తిని చాటేందుకు ప్రతి ఇంటిపై తిరంగా ఎగురవేయాలని, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం మోహనరావు, ఎంపీడీఓ సీహెచ్ ఈశ్వరమ్మ, ఎంఎస్జీఓ ఎం శాంతకుమారి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News