Virat Kohli History: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనత!

Virat Kohli History in IPL: ఐపీఎల్ చరిత్రలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పేరుపై మరో అరుదైన రికార్డును లిఖించుకున్నాడు.

Update: 2026-05-17 11:55 GMT

Virat Kohli History: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనత!

Virat Kohli History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పేరుపై మరో అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఓపెనర్‌గా 5500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌, రాయల్‌ ఛాలెెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. కింగ్ ఈ పరుగులను ఆర్సీబీ తరఫున పూర్తి చేశాడు.

పంజాబ్ కింగ్స్‌, రాయల్‌ ఛాలెెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌కు ముందు ఈ ఘనత సాధించేందుకు విరాట్ కోహ్లీకి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. పంజాబ్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది.. కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో మరో ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా 5500 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మాజీలు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారు. అయితే వారు ఈ పరుగులను పలు ఫ్రాంచైజీలకు ఆడుతూ సాధించగా.. కోహ్లీ మాత్రం కేవలం ఆర్సీబీ తరఫునే సాధించడం విశేషం.

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 500 ప్లస్ పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ రికార్డును కింగ్ మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐపీఎల్ 2026లో విరాట్ 500+ రన్స్ పూర్తి చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కింగ్ తొమ్మిది సార్లు 500 ప్లస్ రన్స్ చేశాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (7), కేఎల్ రాహుల్ (7), శిఖర్ ధావన్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పురుషుల టీ20లలో అత్యధిక 50-ప్లస్ భాగస్వామ్యాలలో పాలుపంచుకున్న బ్యాటర్ల లిస్టులో కింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.

పురుషుల టీ20లలో అత్యధిక 50-ప్లస్ భాగస్వామ్యాలు:

210 - అలెక్స్ హేల్స్

210 – విరాట్ కోహ్లీ

200 - డేవిడ్ వార్నర్

196 - బాబర్ అజామ్

191 – క్రిస్ గేల్

ఐపీఎల్‌లో అత్యధిక 500-ప్లస్ రన్స్:

9 - విరాట్ కోహ్లీ

7 - డేవిడ్ వార్నర్

7 - కేఎల్ రాహుల్

5 - శిఖర్ ధావన్

Tags:    

Similar News