Punjab Kings: ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు.. అయ్యో శ్రేయాస్ అయ్యర్!
Shreyas Iyer Create Unwanted IPL Record. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రాంచైజీ పంజాబ్ కింగ్స్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
Punjab Kings: ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు.. అయ్యో శ్రేయాస్ అయ్యర్!
Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక సార్లు 200+ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా పీబీకేఎస్ నిలిచింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ధర్మశాలలో రాయల్ ఛాలెెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 222 రన్స్ సమర్పించుకోవడంతో పంజాబ్ ఖాతాలో ఈ చెత్త రికార్డు చేరింది. ఐపీఎల్ 2026లో పీబీకేఎస్ బౌలింగ్ విభాగం తీవ్రంగా నిరాశపరుస్తోంది.
ఆర్సీబీ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు ఇచ్చింది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ 200కు పైగా స్కోరు ఇచ్చిన మ్యాచ్‌ల సంఖ్య 9కు చేరింది. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక సార్లు 200+ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా ఇదివరకు సదర్న్ పంజాబ్ జట్టుతో కలిసి సమానంగా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. పాకిస్థాన్ దేశీయ టోర్నీ నేషనల్ టీ20 కప్ 2020/21లో సదర్న్ టీమ్ 8 సార్లు 200కు పైగా స్కోర్లు ఇచ్చింది. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఉన్నాయి.
పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 200+ పైగా స్కోర్లు ఇచ్చిన జట్లుగా కూడా పంజాబ్ కింగ్స్ మరో చెత్త రికార్డును అందుకుంది. ఇపటివరకు పీబీకేఎస్ 46 సార్లు 200+ స్కోర్లు ఇచ్చింది. ఈ జాబితాలో ఆర్‌సీబీ, డీసీ, ఆర్‌ఆర్, ఎస్‌ఆర్‌హెచ్, మిడిల్‌సెక్స్ వరుసగా ఉన్నాయి. అత్యధికంగా 200+స్కోర్లు ఇచ్చిన సారథిగా శ్రేయస్ అయ్యర్ ఓ చెత్త రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్ కెప్టెన్సీలోని టీమ్ ఇప్పటివరకు 31 భారీ స్కోర్లు ప్రత్యర్థి జట్లకు 200+ పైగా స్కోర్లు ఇచ్చింది. మొత్తంగా అటు పంజాబ్, ఇరు శ్రేయస్ ఖాతాలో చెత్త రికార్డులు నమోదయ్యాయి.
పురుషుల టీ20 టోర్నీల్లో అత్యధిక 200+ స్కోర్లు సమర్పించుకున్న జట్లు:
9 – పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్ 2026)
8 – సదర్న్ పంజాబ్ (నేషనల్ టీ20 కప్ 2020/21)
7 – సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఐపీఎల్ 2024)
7 – రాజస్థాన్ రాయల్స్ (ఐపీఎల్ 2025)
7 – లక్నో సూపర్ జెయింట్స్ (ఐపీఎల్ 2025)
7 – పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్ 2025)
7 – రాజస్థాన్ రాయల్స్ (ఐపీఎల్ 2026)
పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 200+ పైగా స్కోర్లు ఇచ్చిన జట్లు:
46 - పీబీకేఎస్
40 - ఆర్‌సీబీ
35 - డీసీ
34 - ఆర్‌ఆర్
34 - ఎస్‌ఆర్‌హెచ్
33 - మిడిల్‌సెక్స్
ఒక కెప్టెన్ ఆధ్వర్యంలో అత్యధికంగా 200-పైగా స్కోర్లు ఇచ్చిన వారు (పురుషుల టీ20లు):
31 - శ్రేయస్ అయ్యర్
29 - ఫాఫ్ డుప్లెసిస్
28 - ఎంఎస్ ధోనీ
21 - బాబర్ అజమ్
20 - రిషబ్ పంత్